
బాలికల కబడ్డీలో జిల్లా జట్టు సత్తా
అనంతగిరి: క్రీడల్లో గెలుపోటములు సహజమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 34వ సబ్ జూనియర్ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రాత్రి ముగిసాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. క్రీడాపోటీలను విజయవంతంగా చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. రాత్రి నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో బాలి కల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు, బాలుర విభాగంలో నల్లగొండ జట్లు విజయం సాధించగా.. రన్నరప్‌గా బాలికల విభాగంలో రంగారెడ్డి, బాలుర విభాగంలో నాగర్‌కర్నూల్ జిల్లా జట్లు నిలిచాయి. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరశురాం నాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఆనంద్, కోశాధికారి నరేందర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, వెంకట్‌రెడ్డి, పీడీలు, పీఈటీలు, నాయకులు పాల్గొన్నారు.
రన్నరప్‌గా నిలిచిన క్రీడాకారులు
స్పీకర్ ప్రసాద్‌కుమార్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment