కేబుల్.. గుబుల్
● రెచ్చిపోతున్న వైర్ల దొంగలు
● విలువైన రాగి తీగల కోసం చోరీలు
● దాడులకు సైతం వెనకాడని దుండగులు
● వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు
● ఆందోళనలో అన్నదాతలు
మొయినాబాద్: వ్యవసాయ బోర్లను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. కేబుల్ వైర్లలో ఉండే రాగి తీగల చోరీకి తెగబడుతున్నారు. ఇటీవల నాలు గు బోర్ల వద్ద కేబుల్ వైర్లు కట్ చేసుకుపోయి, అక్కడే కాపలా ఉన్న రైతుపైనే దాడికి తెగబడ్డారు. మూడు రోజుల క్రితం ఏకంగా 16 మంది రైతుల బో ర్ల నుంచి కేబుల్ వైర్లు కత్తిరించుకుపోయారు. దీంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు దాడులు జరుగుతుండడంతో రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు.
తరచూ చోరీలు
కేబుల్ వైర్ల చోరీలు మండలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. మేడిపల్లి ప్రాంతంలోనే కేబుల్ దొంగలు ఎక్కువగా రెచ్చిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో సుమారు 60 మంది రైతులకు చెందిన వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు కట్ చేసుకుపోయారు. నాలుగు రోజుల క్రితం ముసుగు వేసుకుని వచ్చిన నలుగురు దుండగులు వ్యవసాయ పొలం వద్ద నిద్రిస్తున్న రైతుపై దాడి చేసి గాయపర్చారు. అదే రోజు నాలుగు బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తరించుకుపోయారు.
మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో..
వ్యవసాయ బోర్ల వద్ద స్టార్టర్ బాక్స్ నుంచి మోటార్‌కు రాగితీగలు ఉండే కేబుల్ వేస్తారు. రాగితీగలకోసమే దొంగలు వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు కట్‌చేసుకుపోతున్నారు. స్టార్టర్ బాక్స్ నుంచి మోటార్ వరకు సుమారు 5 నుంచి 10 మీటర్ల కేబుల్ వైరు ఉంటుంది. ఒక్కో రోజు 10 నుంచి 20 మోటార్ల వద్ద కేబుల్ కట్‌చేసుకుపోయి.. వాటిని మంటలో కాల్చి రాగి తీగను బటయకు తీసి విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో రాగి కిలో రూ.1,500 వరకు పలుకుతోంది. దీంతో సొమ్ము చేసుకునేందుకు దుండగులు కేబుల్ వైర్ల చోరీకి పాల్పడుతున్నారు.
పోలీసులకు చిక్కని వైనం
తరచూ కేబుల్ వైర్లు తస్కరిస్తున్న దొంగలు పోలీసులకు చిక్కడంలేదు. చోరీలకు సంబంధించి ఎన్నో కేసులు నమోదైనా పోలీసులు ఎక్కడా దొంగలను పట్టుకున్న దాఖలాలు లేవు. రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యలో దుండగులు చోరీలకు పాల్పడుతున్న ట్లు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో పోలీసు లు గస్తీ పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేక బృందాలతో నిఘా
ఇటీవల కేబుల్ వైర్ల చోరీ లు ఎక్కువగా జరుగుతు న్నాయి. గ్రామాల్లోని చిల్లర దొంగల పనే అయి ఉంటుందని భావిస్తున్నాం. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. చోరీలు జరుగుతున్న ప్రాంతాల్లో నిఘా పెంచాం. గ్రామాల్లో, వ్యవసాయ పొలాల్లో అనుమానితులు తిరిగితే రైతులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాలి.
– పవన్‌కుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, మొయినాబాద్
తీవ్రంగా నష్టపోతున్నాం
నెల రోజుల నుంచి తరచూ కేబుల్ వైర్లు కోసుకుపోతున్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేబుల్ వైర్లు కోసుకపోవడంతో మోటార్లు నడవక పొలాలకు నీళ్లు అందుతలేవు. మళ్లీ కేబుల్ వైర్లు కొని కనెక్షన్ ఇవ్వాల్సి వస్తోంది. దీంతో చాలా నష్టం జరుగుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు.
– బుల్కపురం నర్సింలు, రైతు, మేడిపల్లి
కేబుల్.. గుబుల్
కేబుల్.. గుబుల్
Comments
Please login to add a commentAdd a comment