రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి..
ఇబ్రహీంపట్నం: అదుపుతప్పిన లారీ వెనక నుంచి స్కూటీని ఢీకొట్టిన ఘటనలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సరూర్‌నగర్ మండలం బైరామల్‌గూడ, సాగర్ ఎన్‌క్లేవ్, రెడ్డి కాలనీలో నివసించే కొంతం మనోజ్‌రెడ్డి(19) తన స్నేహితుడు అన్వేష్‌రెడ్డితో కలిసి స్కూటీపై మంగల్‌పల్లి సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తున్నారు. తుర్కయంజాల్ ఆరోగ్య ఆస్పత్రి వద్దకు రాగానే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పిన లారీ (టీఎస్02యూసి1631) వెనక నుంచి వీరిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మనోజ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా అన్వేష్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఈసమయంలో రోడ్డు పక్కన ఉన్న మరో గుర్తు తెలియని వ్యక్తికి సైతం గాయాలయ్యాయని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మరో ఇద్దరికి గాయాలు
స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఘటన
Comments
Please login to add a commentAdd a comment