జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం: నిరుద్యోగ యువత జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టీఎఎస్‌కే) ఆధ్వర్యంలో సుమారు 30 కంపెనీలతో బొంగ్లూర్ ప్రమీద గార్డెన్‌లో శనివారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబమంతా ఎవరిపైనా ఆధారపడకుండా బాగుపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 30 కంపెనీల ప్రతినిధులను తీసుకొచ్చి నాలుగు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్‌రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ ప్రాంతంలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి కంకణబద్ధుడై పనిచేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పలు కంపెనీలు ఫోర్త్ సిటీలో ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. అనంతరం జాబ్‌మేళాలో ఎంపికై న వారికి ఎంపీ, ఎమ్మెల్యే కలిసి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆయా కంపెనీల ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment