అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి, డీసీపీలు శ్రీనివాస్, సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను త్వరగా పరిష్కరించాలని, దోషులకు శిక్షపడేలా చేసి, బాధితులకు న్యాయం దక్కేలా చూడాలని కోరారు. అణగారిన వర్గాలపై ఇప్పటికీ వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దన్నారు. అధికారులు ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను విధిగా తనిఖీ చేయాలని, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. భూ సమస్యలపై ఆర్డీఓలతో విచారణ జరిపించి వారికి సత్వర న్యాయం దక్కేలా చూస్తామని చెప్పారు. ఈనెల 31లోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Comments
Please login to add a commentAdd a comment