రైతులకు విశ్రాంతి భవనాలు
● మామిడి సీజన్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం ● గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: మామిడి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం మామిడి సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై మండల పరిధిలోని బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, వ్యాపారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు.
అధిక కమీషన్ వసూలుపై నజర్
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్‌లో మౌలిక వసతులు కల్పిస్తామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు విశ్రాంతి భవనం, వెద్య సేవలు అఽందిస్తామన్నారు. దీంతో పాటు వాహనాల రద్దీ కారణంగా ఏర్పడే ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఫైర్ ఇంజన్‌ను అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్కెట్‌లో అధిక కమీషన్లు వసూలు చేసే వారిని గుర్తించి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు, ఫైర్‌స్టేషన్ సీఐ యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గం సభ్యులు మధుసూదన్‌రావు, రఘుపతిరెడ్డి, జైపాల్‌రెడ్డి, అంజయ్య, లక్ష్మి, నరసింహ, గోవర్ధన్‌రెడ్డి, నవరాజ్, గణేశ్‌నాయక్, మచ్చెందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లుగుప్తా, ఇబ్రహీం, అధికారులు, వ్యాపారు లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment