ఆదాయంలో సగం రవాణాకే
యాచారం: ఆదాయంలో సగం రవాణాకే ఖర్చువుతోందని, కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు స్థానికంగా మార్కెట్ సదుపాయం కల్పించాలని మండలంలోని రైతులు అధికారులను కోరా రు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి ఆదేశం మేరకు హార్టికల్చర్, సెరీకల్చర్ శాఖ జిల్లా అధికారి కె.సురేశ్ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారుల బృందం సోమవా రం మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్‌పల్లిలో పర్యటించింది. రైతులు సాగు చేసిన పలు కూరగాయలు, ఆకుకూర తోటలను అధికారులు పరిశీలించారు. పెట్టుబడులు, దిగుబడులు, మార్కెటింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సబ్సిడీపై ఉద్యాన పరికరాలు, నార్లు అందించాలని తెలిపారు. ఆతర్వాత రాయితీలు నిలిపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పంట ఉత్పత్తులను నగరంలోని వివిధ మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నామని, దీంతో రవాణాకే అధికంగా ఖర్చువుతోందని తెలిపారు. పుదీనా పంటకు బీమా వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ నుంచి అధికారి శ్రీహరి, ఉద్యాన, పట్టు పరిశ్రమ డివిజన్ అధికారి నవీన, ఏఓ రవినాథ్, ఆయా గ్రామాల రైతులు సురేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, నర్సింహారెడ్డి, సందీప్‌రెడ్డి, రాములు, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూరగాయలు, ఆకుకూర రైతుల ఆవేదన
మార్కెట్ సదుపాయం కల్పించాలని వినతి
పుదీనా పంటకు బీమా వర్తింపజేయాలని వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment