కబ్జా స్థలాలను స్వాధీనం చేసుకుంటాం
● సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జగన్
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ ఆధీనంలో ఉన్న పేదల ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకునేంత వరకు పోరు ఆగదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.జగన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని ముకునూర్ గ్రామంలో రామోజీ ఫిలిం సిటీ ఇళ్ల స్థలాల పోరాట కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిలిం సిటీలోని ఇళ్ల స్థలాలను సాధించేందుకు ఉరూరా పోరాట కమిటీలను వేసి ఉద్యమిస్తామన్నారు. 670 మంది పేదలకు ఇంటి స్థలాలను 2007లో ఇచ్చినా రామోజీ ఫిలిం సిటీ కబ్జాలోనే మగ్గుతున్నాయన్నారు. ఇన్నేళ్లుగా పోరాడుతున్నామని.. ప్రజల ఓపికను పరీక్షించవద్దని హెచ్చరించారు. ముకునూర్‌లో పది మంది సభ్యులతో కూడిన ఇళ్ల స్థలాల పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కృష్ణ, సువర్ణ, సంతోష, సత్తమ్మ, పద్మ, యాదమ్మ, ఇందిరమ్మ, హబీబా, స్వరూప, అండాలును కమిటీ సభ్యులుగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment