మత్తుతో జీవితాలు చిత్తు
● యువత వ్యసనాలకు బానిస కావద్దు ● యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్‌సందీప్ శాండిల్య
నందిగామ: యువత, విద్యార్థులు మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని యాంటి నార్కోటిక్స్ డైరెక్ట ర్ సందీప్ శాండిల్య అన్నారు. మండల పరిధిలోని మొదళ్లగూడ శివారులోని సింబయాసిస్ అంతర్జాతీ య విశ్వవిద్యాలయంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు మత్తు పదార్థాలతో తలెత్తే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసైతే అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, ఇది సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ భవిష్యత్తు యువత చేతులోనే ఉందని, చెడు వ్యసనాలకు బానిసలుగా మారొద్దని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి లాంటివి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మత్తుకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సుబ్బరామిరెడ్డి, హరిశ్చంద్రరెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, యూనివర్సీటీ డైరెక్టర్ డాక్టర్ కె.పి వేణుగోపాల్ రావు, రజనీకాంత్, లీగల్ ఎయిడ్ సెంటర్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ కె.శాంతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment