
ఆ లింక్‌లు ఓపెన్ చేయొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్‌లో వచ్చే తెలియని లింక్‌లని ఓపెన్ చేసి మోసపోవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్ సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని తులేకలాన్ గ్రామంలో డిజిటల్ లావాదేవిలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజర్వు బ్యాంకు అధికారులు హాజరై మాట్లాడుతూ.. అపరిచిత లింక్‌లు కలిగి ఉన్న ఎస్‌ఎంఎస్, ఈమెయిల్‌ని వెంటనే డిలిట్ చేయాలన్నారు. ఆర్థిక వివరాల ధ్రువీకరణ కోరే వెబ్‌సైట్‌ను నిర్ధారించుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలని లేదా బ్యాంకు సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయడంతో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందన్నారు. డబ్బులు అడిగే అపరిచత వ్యక్తుల కాల్స్, ఈమెయిల్స్‌లకి సమాధానం ఇవ్వొద్దన్నారు. పెద్ద మొత్తంలో రాబడుల ఆశ చూపేవారి వెబ్‌సైట్స్ యాప్‌ల వివరాలని తనిఖీ చేసుకోవాలన్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి చెల్లింపులు చేసే సమయంలో స్క్రీన్‌పై పేరు సరి చూసుకోలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్(ఆపరేషన్స్) మురళికృష్ణ, అధికారులు సుధాకర్, బాలవెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రిజర్వు బ్యాంకు అధికారులు సావిత్రి, రెహమాన్
తులేకలాన్‌లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన సదస్సు
Comments
Please login to add a commentAdd a comment