● 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా
● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
యాచారం: గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవా లని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ అధ్యక్షతన మంగళవారం యాచారంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి ఇచ్చేస్తామని పేర్కొందన్నారు. ఫార్మాసిటీ భూసేకరణలో పెద్ద భూ కుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తోందని తెలిపారు. ఫార్మాసిటీ రైతులకు మద్దతుగా, భూరికార్డుల్లో టీజీఐఐసీ పేరు తీసేసి రైతుల పేర్లు నమోదు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న నక్కర్తమేడిపల్లి నుంచి వందలాది మంది రైతులతో పాదయాత్ర నిర్వహిస్తామని, 28న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని లిపారు. ఈ కార్యక్రమనికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, నాయకులు బ్రహ్మయ్య, జంగయ్య, చందునాయక్, పెద్దయ్య, జగన్, వెంకటయ్య, తావునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పనకు కృషి
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎల్మినేడులో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు 68 మంది దరఖాస్తు చేసుకోగా 52 మందిని స్పాట్ సెలక్షన్ చేశారన్నారు. త్వరలోనే మిగిలిన వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ డైరెక్టర్ ఉష, మేనేజర్ భారతి, కాంగ్రెస్ అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు జంగయ్య, సురేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గోవులను తరలిస్తున్న వాహనాల అడ్డగింత
చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గోవులను చేవెళ్ల బజరంగ్‌దళ్, బీజేవైఎం, హిందూ సంఘాల నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంగళవారం సర్ధార్‌నగర్ నుంచి చేవెళ్ల మీదుగా హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న వాహనాలను గుర్తించిన బీజేపీ అనుంబంధ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గోవులను నార్సింగి పరిధిలోని గోషాలకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్‌దళ్ నాయకులు అనిల్‌కుమార్, సహా ప్రముఖ గణేశ్, ధర్మ రక్షా ప్రముఖ్ రాఘవేంద్రచారి, కావలి శివకుమార్, అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
27న ఫార్మా రద్దుకు పాదయాత్ర
27న ఫార్మా రద్దుకు పాదయాత్ర