షాద్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగులు, కార్మికులకు ఎలాంటి ఊరటనివ్వలేదు. బడ్జెట్‌లో ప్రభుత్వం కార్మిక శాఖకు నామమాత్రంగా రూ.900 కోట్ల కేటాయించింది. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీలు, మున్సిపల్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ తదితర శాఖలకు వేతనాల పెంపు గురించి, క్రమబద్ధీకరణపై బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలను పూర్తిగా విస్మరించింది.
– రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు