షాద్‌నగర్: అమెరికాలోని ఫ్లోరిడాలో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి అంత్య క్రియల్లో పాల్గొన్న బంధువులు, కుటుంబ సభ్యులు మృతులకు తుది వీడ్కోలు పలికారు. కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి, పవిత్ర దంపతుల కూతురు ప్రగతిరెడ్డి, మనమడు హర్వీన్‌రెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే. మృతదేహాలను ఇండియాకు తెచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. భారత కాలమాణం ప్రకారం గురువారం రాత్రి 10గంటలకు ఓర్లాండో అవెన్యూలోని ఫ్యూనరల్ హోం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మృతులతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.