షాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని సంకెపల్లిగూడ పంచాయతీకి అనుబంధ గ్రామమైన శేరిగూడకు చెందిన చీమల బాల్‌రాజ్ (40), హరిబాబు (42) కలిసి శనివారం మధ్యాహ్నం కూలి పనికోసం బాల్‌రాజ్ బైక్‌పై నాగర్‌గూడకు వెళ్తున్నారు. మల్లారెడ్డిగూడ సమీపంలో రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్ బలంగా ఢీ కొట్టింది. దీంతో బాల్‌రాజ్, హరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాల్‌రాజ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరిబాబును ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాల్‌రాజ్‌కు భార్య హంసమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. హరిబాబు 25 ఏళ్ల క్రితం ఒంగోలు జిల్లా టంగుటూరు నుంచి వలస వచ్చారు. మూడేళ్ల కిత్రం హరిబాబు భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాల్‌రాజ్ భార్య హంసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిని, రోడ్డు మధ్యలో డివైడర్ తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముద్దెంగూడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, మల్లారెడ్డిగూడ, సంకెపల్లిగూడ మాజీ సర్పంచ్‌లు చందిప్ప జంగయ్య, కుమ్మరి దర్శన్, బీజేపీ మండల అధ్యక్షులు మద్దూరు మాణెయ్య డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రాంగురూట్‌లో వచ్చి.. బైక్‌ను ఢీకొట్టి
రాంగురూట్‌లో వచ్చి.. బైక్‌ను ఢీకొట్టి
రాంగురూట్‌లో వచ్చి.. బైక్‌ను ఢీకొట్టి