యాచారం: పశువుల మేత విషయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో దాడి చేసిన వ్యక్తికి ఇబ్రహీంపట్నం న్యాయస్థానం 14 రోజులరిమాండ్ విధించింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చర్ల గ్రామంలో పశువుల మేత విషయంలో ఈ నెల 12న అదే గ్రామానికిచెందిన ఎర్ర మల్లయ్య, ఎదిరే కృష్ణయ్య మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఎర్ర మల్లయ్య తన చేతిలో ఉన్న గొడ్డలికామతో ఎదిరే కృష్ణయ్యను కొట్టగా అతనికి తీవ్ర గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇబ్రహీంపట్నం న్యాయస్థానం శనివారం ఎర్ర మల్లయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది.