
విద్యలో ఏఐ విప్లవం
కేశంపేట: ప్రభుత్వం సర్కార్ బడుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(కృతిమ మేధ) ద్వారా విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ఏఐ సహకారంతో విద్యార్థులకు సులభంగా, ఆకట్టుకునేలా వినూత్నంగా బోధన చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి
ఏఐ బోధన కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఈ నెల 17న, 18న మండల పరిధిలోని ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 25 నుంచి బోధన ప్రారంభించారు.
ఏఐ బోధనకు ఎంపిక చేసిన పాఠశాలలు
మొదటి విడత: కోకాపేట, అజీజ్‌నగర్, పెద్ద ఎల్కిచర్ల, పెద్ద మంగళారం, టంగుటూరు, తంగేడపల్లి, మల్కారం, రెడ్డిపల్లి, రావిర్యాల
రెండో విడత: కొత్తపేట, అజీజ్‌నగర్, జిల్లేల్‌గూడ, బహదూర్‌గూడ
బ్యాచ్‌కు ఐదుగురు విద్యార్థులు
విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే మౌఖిక భాష, సంఖ్యా శాస్త్రం, ఇంగ్లిష్ అభ్యసనంతో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఐదుగురు చొప్పున ఒక బ్యాచ్ చేసి బోధిస్తున్నారు. ఎంపిక చేసిన విద్యార్థుల సామర్థ్యాలను 20 నిమిషాల నిడివితో ప్రశ్నలు ఉంటాయి. ఏఐ సులభంగా, సరళమైన భాషలో పాఠ్యాంశాలను బోధిస్తుంది. దీంతో ప్రతిభ పెరిగి చదువుల్లో రాణిస్తారు.
ప్రాథమిక తరగతుల నుంచే కృతిమ మేధతో బోధన
సర్కారు బడుల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ