
పోలీసుల అదుపులో నిందితులు
మెదక్ మున్సిపాలిటీ: బంగారం అపహరించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 9వ తేదీన మెదక్ పట్టణంలోని మెహతాబ్ బంగారు దుకాణంలో నలుగురు మహిళలు 30 గ్రాముల బంగారు బిస్కెట్, 4 జతల కమ్మలు అపహరించారు. దుకాణయజమాని షకీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా ఖమ్మం జిల్లాలోని మధిర మండలం, రాయపట్నం గ్రామానికి చెందిన బాలసాని వెంకటరామమ్మ, బొజ్జని నాగేంద్రమ్మ, బొజ్జని దీనమ్మ , నల్లబొట్ల వెంకటమ్మలుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ లింగం, కానిస్టేబుల్ సాయిబాబాగౌడ్, శివరాజ్‌గౌడ్, గంగరాజు, రవి, రాజులను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment