
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ క్రాంతి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల ప్రభుత్వ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, ఉస్మాన్‌నగర్‌లోని కస్తూర్బా బాలికల పాఠశాలలను శనివారం సాయంత్రం కలెక్టర్ క్రాంతి తనిఖీ చేశారు. పాఠశాలలోని కిచెన్ షెడ్డు, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థికి పదికి పది జీపీఏ వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.
విద్యార్థుల ఫిర్యాదు
వెలిమెలలో ప్రభుత్వ మోడల్ స్కూల్ ఆవరణలోని హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ క్రాంతికి భోజనం సరిగా ఉండటంలేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు భోజనం సరిగా ఇవ్వడం లేదని, కూరలో నీళ్లు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. దీంతో నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వారాల్లో పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment