
హుందాగా ప్రవర్తించాలి: ఎస్పీ
పటాన్‌చెరు టౌన్/సంగారెడ్డి ఎడ్యుకేషన్: పనిచేసే చోట మహిళా సిబ్బందితో మర్యాదగా, హుందాగా నడుచుకోవాలని, ఇతరుల పట్ల గౌరవం ముందు మన నుంచే ప్రారంభం కావాలని జిల్లా ఎస్పీ రూపేశ్ పేర్కొన్నారు. పటాన్‌చెరు మండలం, రుద్రారం గీతం ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పనిచేసే చోట మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి నూతన చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడతాయన్నారు. అత్యాశకు పోయి డబ్బులు రెట్టింపు అవుతాయని అడ్డదారుల్లో సంపాదించేందుకు ప్రయత్నించకూడదని హితవు పలికారు. అవసరాల రీత్యా మాత్రమే రుణాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కల్యాణి, డీఎస్పీలు రవీందర్‌రెడ్డి, సత్తయ్యగౌడ్, రామ్మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జిల్లా సీఐలు, ఎస్‌ఐలు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
సీరియస్‌గా కాదు సిన్సియర్‌గా చదవాలి
విద్యార్థులు సీరియస్‌గా కాకుండా సిన్సియర్‌గా చదువుకోవాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగితేనే గమ్యం చేరుకోవచ్చని ఎస్పీ రూపేశ్ విద్యార్థులకు సూచించారు. శనివారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎస్సీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫేర్‌వెల్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి. పూర్వ విద్యార్థులు సైతం హాజరై కళాశాలతో, అధ్యాపకులతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్వీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment