
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
● కుక్కలకు పెరుగుతున్న క్రేజ్
● కుటుంబంలో ఒకటిగా
స్థానం కల్పిస్తున్న పెట్ లవర్స్
● ఇంటి రక్షణ కోసం పెంపకం
● జాతిని బట్టి రూ.వేల నుంచి
రూ.లక్షల్లో ఖరీదు
● పెట్ క్లబ్‌లకూ భలే డిమాండ్
● మంచి ఆహారం, కాస్మోటిక్స్, బాతింగ్
‘ఏం బతుకురా నీది.. కుక్క బతుకు’ అని చాలా తేలిగ్గా మాట్లాడుతాం. ఈ తిట్టుకు ఇప్పుడు అర్థం మార్చేస్తోంది ఆధునిక సమాజం. పూట కూడా గడవని మనుషులు ఒకవైపు.. విలాసాలకు అలవడిన ధనికులు మరోవైపుగా చీలిపోతున్న సమాజంలో పెంపుడు కుక్కలకూ మనషుల జీవనశైలి అలవాటు చేస్తోంది. ఇప్పుడు కుక్కలు పార్కులకు వెళ్తాయి.. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడతాయి..వాటికి నచ్చిన ఆహారం తింటాయి.. ఉదయాన్నే బయటికి వెళ్లి షికార్లు కొడతాయి. పుట్టిన రోజులు కూడా చేసుకుంటాయి. తోటి కుక్కలతో కలసి పార్టీలు చేసుకుంటాయి. మనిషి, శునకాల జీవనశైలికి అంతగా తేడాలేకుండా పోతుందని ఆశ్చర్యపడుతున్నారా? అవును.. రూ.లక్షలు ఖర్చు చేసి మరీ వాటి బాగోగులు చూస్తున్నారు. డాగ్ లవర్స్ అనే పరిధి దాటి పెట్ పేరెంట్స్‌గా చెప్పే స్థాయికి చేరుకుంది ఎలైట్ సొసైటీ. పెట్‌ను పెంచుకోవడమంటే వారి కుటుంబంలోకి ఓ వ్యక్తిని ఆహ్వానించినట్లే.. మరి ఆ అతిథిని వీరంతా ఎలా చూసుకుంటున్నారనే దానిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– పర్చ శ్రీనాథ్, రామచంద్రాపురం(పటాన్‌చెరు)
కొండాపూర్(సంగారెడ్డి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలో శనివారం ఓ ఫంక్షన్‌హాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రులు దామోదర, కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మత రాజకీయాలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ సర్వమతాలను సమానంగానే చూసిందని తెలిపారు. కొన్ని పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలో చేసిన అభివృద్ధిని పట్టభద్రులకు వివరించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్ల్లోనూ గెలుపు సులభమవుతుందని తెలిపారు. నరేందర్‌రెడ్డి గత 35 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించిన విద్యావేత్తని ప్రశంసించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ....ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తోందన్నారు. ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు క్రాస్ ఓటింగ్ వల్లే ఎంపీగా గెలుపొందారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా కేటాయించారన్నారు. రేవంత్ సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ...ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఉద్యోగుల,పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఒక యూనివర్సిటీ ఉందని, ఉమ్మడి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు నర్సింహారెడ్డి, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్,నాయకులు సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు
8లో u
కాంగ్రెస్‌కు సర్వ మతాలు సమానమే
క్రాస్ ఓటింగ్‌తోనే బీజేపీ ఎంపీ గెలుపు
మంత్రులు దామోదర రాజనర్సింహ,
కొండా సురేఖ
యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

గెలుపే లక్ష్యంగా పని చేయాలి
Comments
Please login to add a commentAdd a comment