
నాణ్యమైన విద్య అందించాలి
జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు
పటాన్‌చెరు టౌన్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శనివారం బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌పై ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ...ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌పై ఇస్తున్న శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభమైన పద్ధతిలో బోధించగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవోలు రాజేశ్వరరావు నాయక్, పీపీ రాథోడ్, బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం స్పందన, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యతోనే
మంచి భవిష్యత్
డీజీపీ అభిలాష్ బిస్త్
జహీరాబాద్ టౌన్: ఉన్నత విద్యతోనే మంచి భవిష్యత్ ఏర్పడుతుందని, కలలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర పోలీసు అకాడమీ(ట్రైనింగ్) డీజీపీ అభిలాష్ బిస్త్ పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని మహీంద్ర అకాడమీ హై స్కూల్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన 27వ వార్షికోత్సంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. నిర్లక్ష్యం కారణంగా తాను కూడా యూపీఎస్‌సీ పరీక్షలో దెబ్బతగిలిందని ఆ తర్వాత పట్టుదలతో లక్ష్యాన్ని అధిగమించానని గుర్తు చేసుకున్నారు. పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచాలని, ఫోన్ ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో మహీంద్ర గ్రూప్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు మెంబర్, ఆనంద్ మహీంద్ర సోదరి రాధికనాథ్, మహీంద్ర గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షీతల్ మెహతా, సినీ నటుడు మానవ కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించండి
టీపీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా
నారాయణఖేడ్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించేందుకు కృషి చేయాలని తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్లా ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యేను ఖేడ్‌లోని ఆయన నివాసంలో కలసి సంఘం 2025 నూతన సంవత్సర డైరీని అందజేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కృషిచేయాలని ఆయనను ఎమ్మెల్యే కోరారు.
Comments
Please login to add a commentAdd a comment