అంగన్‌వాడీలను మెరుగ్గా నిర్వహించాలి
జహీరాబాద్ టౌన్: అంగన్‌వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని శిశుసంక్షేమ శాఖ జిల్లా డీడబ్ల్యుఓ లలిత కుమారి అన్నారు. జహీరాబాద్ మండలం రంజోల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం ప్రాజెక్టు మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలు మెరుగు పడాలంటే సూపర్‌వైజర్లు ప్రతి నెల సెంటర్లను తనిఖీలు చేయాలన్నారు. కేంద్రాల నిర్వహణ శుభ్రంగా ఉండాలని, టీచర్లు సమయపాలన పాటించాలని, పిల్లలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. గుడ్లు, బాలామృతం ప్లస్‌కు లోటురాకుండా చూసుకోవాలన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటున్నారా అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. వీటిపైన సూపర్‌వైజర్లు దృష్టి పెట్టాలని సూచించారు.
జిల్లా శిశు సంక్షేమశాఖ
డీడబ్ల్యుఓ లలిత కుమారి
Comments
Please login to add a commentAdd a comment