చెక్‌ డ్యాం నిర్మాణాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

చెక్‌ డ్యాం నిర్మాణాల పరిశీలన

Published Tue, Mar 11 2025 7:23 AM | Last Updated on Tue, Mar 11 2025 7:22 AM

చెక్‌

చెక్‌ డ్యాం నిర్మాణాల పరిశీలన

నారాయణఖేడ్‌: యునైటెడ్‌ వే ఆఫ్‌ ముంబై సంస్థ ప్రిన్స్‌పైప్స్‌ సహకారంతో ‘జలసంజీవని విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’లో భాగంగా ఖేడ్‌ మండలం గైరాన్‌తండా, సీతారాం తండా శివారులో రెండు చెక్‌ డ్యాంలు, చాప్టా(కె) శివారులో మరో చెక్‌ డ్యాంను నిర్మించారు. సోమవారం సంస్థ జిల్లా మేనేజర్‌ శివరాజ్‌నాయక్‌, ఇన్‌చార్జి అజీజ్‌ టొంబాలి, ఇంజనీర్‌ కృష్ణ, ఫీల్డ్‌ ఆఫీసర్లు శ్రీకాంత్‌, ప్రియాంక సందర్శించి పరిశీలించారు. తమ సంస్థ ద్వారా భూగర్భజలాల పెంపు, వాననీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడంలో భాగంగా మల్టిలేయర్‌ ఫార్మింగ్‌, ఆగ్రో హర్టికల్చర్‌, నర్సరీలు, ఫాంపాండ్‌ నిర్మాణం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే, చాప్టా(కె), అబ్బెంద ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించినట్లు వివరించారు.

డంపింగ్‌ యార్డుపై ఫిర్యాదు

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్‌ డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు 34వ రోజుకు చేరుకున్నాయి. ఈ సమస్యను జేఏసీ సభ్యులు ప్రాంతవాసులతో కలిసి జిల్లా కలెక్టర్‌ వద్ద మొర పెట్టుకున్నారు. గతంలో గ్రామపంచాయతీ తీర్మానాల పత్రాలను కలెక్టర్‌కు వివరించారు. శాంతియుతంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులను రాంకీ పరిశ్రమ తప్పుదోవ పట్టిస్తుందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2021 నాటి లేఖను కలెక్టర్‌కు జతపరిచి వివరించారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటును రద్దుచేయాలని కలెక్టర్‌కు జేఏసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

జేఏసీకి విరాళం అందజేత

ప్యారానగర్‌ డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ పిలుపు మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు రోజురోజుకు స్థానికుల నుంచి మద్దతు పెరుగుతతోంది. ఉమ్మడి జిన్నారం మండలాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమవారం జేఏసీ కమిటీ సభ్యులను కలిసి రూ.10 వేల విరాళాన్ని అందజేశారు.

టీచర్లను మానసిక

ఒత్తిడికి గురిచేయొద్దు

యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సాయిలు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: కేజీబీవీ, యుఆర్‌ఎస్‌లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడంలో, టైం యాప్‌ ద్వారా ఉదయం సాయంత్రం అసెంబ్లీ రికార్డు చేసి పంపమనడంతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవతున్నారని పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల బాగోగులు బోధన పైన ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అరకొర జీతాలతో పనిచేస్తున్న వారికి 28 రోజుల జీతం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమ్మె కాలపు జీతాన్ని ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూటీఎఫ్‌ కేజీబీవీ శాఖ జిల్లా ఇన్‌చార్జి రాజేశ్వరి, గీత తదితరులు పాల్గొన్నారు.

ఎంఆర్‌ఎఫ్‌ కార్మికుల ఆందోళన

సంగారెడ్డి జోన్‌: ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే.. కలెక్టర్‌ను కలిసేందుకు వారు ప్రయత్నించగా..గేటు వద్ద పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో గంటల తరబడి కలెక్టరేట్‌ ఎదుట నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలో పర్మినెంట్‌ చేయాలని కోరితే మొత్తానికి తీసేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 350 మంది జీవితాలను రోడ్డున పడేశారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చెక్‌ డ్యాం  నిర్మాణాల పరిశీలన1
1/1

చెక్‌ డ్యాం నిర్మాణాల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement