నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు
పటాన్‌చెరు టౌన్: నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగాలు సాధించవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎన్‌ఐఐటీ ఎన్‌జీఓ మైక్రోసాఫ్ట్ కంపెనీ వారి సౌజన్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్ అనే అంశాలపై మూడు నెలల శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రిన్సిపాల్ సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... శిక్షణలో 120 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 116 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. శిక్షణ శిబిరం కళాశాల టాస్క్ సమన్వయకర్తగా వ్యవహరించిన అధ్యాపకురాలు ప్రవీణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలోనే కాకుండా లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా సెల్ప్‌స్టడీ చేసి శిక్షణ నిర్వహించి, విద్యార్థులను పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ పూణమ్ కుమారి, కరుణ కుమారి, వెంకటేశం, మల్లిక, సంతోష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment