31 వరకు రాయితీ గడువు
సంగారెడ్డి జోన్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లాలోని వివిధ ఽశాఖల అధికారులు, లేఅవుట్ డెవలపర్లతో ఎల్‌ఆర్‌ఎస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని చెప్పారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కూడా నిర్ణీత కాలంలో డబ్బులు చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తులు చేసిన వారికి రాయితీ గురించి వివరించాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్లాట్లు ,లేఔట్లలో ఉన్న దరఖాస్తుదారులకు నూతన విధానంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి, డీపీవో సాయిబాబా, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
102 మంది పిల్లలకు వీల్‌చైర్ల పంపిణీ
పట్టణంలోని సంజీవ్‌నగర్ కాలనీ భవిత సెంటర్‌లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకం, అలిమ్కో సంస్థ ఆధ్వర్యంలో 102 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు కలెక్టర్ క్రాంతి ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. సాధారణ పిల్లలతో పాటు విద్యను అభ్యసించేలా అనేక రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
సకాలంలో ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు చెల్లిస్తేనే ఈ అవకాశం
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment