![ఖేడ్‌లో ఉచితకంటి పరీక్షలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/19/18nrk05-350066_mr-1734573203-0.jpg.webp?itok=GZdoDh52)
ఖేడ్‌లో ఉచితకంటి పరీక్షలు
నారాయణఖేడ్: పట్టణంలో బుధవారం సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాదు నానక్ రాంగూడలోని శంకర కంటి ఆస్పత్రి వైద్యులు ఖేడ్ ప్రాంతానికి చెందిన 50 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో 26 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించి, వారిని ప్రత్యేక వాహనంలో శంకర కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సత్యసాయి 100వ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతీనెల సంగారెడ్డి జిల్లాలో మూడు ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment