అమరుల త్యాగాలు మరువలేనివి
హుస్నాబాద్‌రూరల్: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి పేదలను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేయడంలో అసువులుబాసిన అమరవీరుల త్యాగాలు మరువ లేనివని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్ గుట్టల్లో అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి 77వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ పేదలను దొరలు, భూస్వాములు దోపిడీ చేస్తుంటే అనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. కరీంనగర్ ప్రాంతం నుంచి అనభేరి ప్రభాకర్, సింగిరెడ్డి భూపతిరెడ్డిల ఆధ్వర్యంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసుకొని పోరాటం చేశారని కొనియాడారు. మహ్మదాపూర్‌లో అనభేరి, సింగిరెడ్డిల సాయుధ దళాలు షెల్టర్ తీసుకున్న సమాచారంను రజాకార్లు తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ఊరిని చుట్టుముట్టి దాడి చేయడంతో 13 మంది అమరులయ్యారన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వలేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. అనంతరం అమరుల సమాధుల వద్ద వెంకటరెడ్డి నివాళులర్పించారు. అనంతరం చాడ సమక్షంలో గజ్వేల్ నియోజకవర్గం బీఎస్పీ నాయకుడు కానుగుల రమనాకర్ సీపీఐలో చేరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, గడిపె మల్లేశ్, వనేష్, కొమ్ముల భాస్కర్, సంజీవరెడ్డి, కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment