పండుగ పూట విషాదం
స్నానానికి వెళ్లి బావిలో మునిగి యువకుడి మృతి
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని వడ్డి గ్రామంలో హోలీ పండుగ రోజున విషాదం అలుముకుంది. బావిలో స్నానానికి వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందాడు. హద్నూర్ ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. వడ్డి గ్రామానికి చెందిన శివకుమార్(19) శుక్రవారం మిత్రులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం ఐదుగురు మిత్రులతో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. శివకుమార్‌తోపాటు ఆనంద్‌కు ఈత రాకపోవడంతో స్నానానికి వెళ్లొద్దని తోటి మిత్రులు సూచించారు. అయినా వినకుండా తాడు సాయంతో బావిలోకి దిగడంతో నీట మునిగి మృతి చెందాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో శివకుమార్ మృతదేహం లభ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. వారి మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment