
పిల్లల సంక్షేమానికి కృషి చేయాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్: పిల్లల సంక్షేమం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టులో జువైనల్ జస్టిస్ చట్టం, పోక్సో చట్టాలపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లలకు బాలల హక్కుల మీద ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. బాల్యవివాహాల చట్టాల మీద అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పంకజ్, జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment