అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
వర్గల్(గజ్వేల్): తాను పుట్టిన ఊరు, రాజకీయ జన్మనిచ్చిన వర్గల్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం వర్గల్ ఎస్సీ వాడలో రూ. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు అధిగమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అద్భుత పాలన కొనసాగిస్తున్నారని, అడిగిన వెంటనే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయించారన్నారు. మరోవైపు వివిధ పనుల ద్వారా గజ్వేల్ అభివృద్ధికి రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. రైతులకు అండగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి పంటలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment