విద్యతోపాటు ప్రకృతిని కాపాడాలి
కౌడిపల్లి(నర్సాపూర్): భవితరాల భవిష్యత్ కోసం విద్యతోపాటు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డబ్ల్యూఈఓ (ప్రపంచ పర్యావరణ సంస్థ) వ్యవస్థాపక అధ్యక్షుడు భద్ర తెలిపారు. మండలంలోని దేవులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గదుల సమస్య ఉండటంతో హెచ్‌అండ్‌ఆర్ బ్లాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూఈఓ ఆధ్వర్యంలో రూ.1.50 లక్షలతో వరండాలో గోడలు నిర్మించి గ్రిల్స్ ఏర్పాటు చేసి గురువారం అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్ నినాదంతో ప్రకృతిని కాపాడాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. హెచ్‌అండ్‌ఆర్ టీమ్ లీడర్ హరీశ్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి కోసం తమవంతు కృషి చేశామని తెలిపారు. అనంతరం అధికారులు, సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, హెచ్‌ఎం క్రిష్ణమూర్తి, సంస్థ ప్రతినిధులు రామక్రిష్ణ, శిల్పిక, రిజ్వాన్, మిథిలేష్, అనంత్‌సారధి, యుగేందర్, ఉపాధ్యాయులు చైతన్య, వీనారాయ్, సందీప్, నరేందర్, నాయకులు సత్తయ్య, శివరాజ్, మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment