
భవానీ మాత ఆలయంలో చోరీ
జహీరాబాద్: జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలో గల పురాతన భవానీమాత ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం రాత్రి గు ర్తుతెలియని దుండగులు ఆలయం ప్రధాన ద్వారం తాళం పగుల గొట్టి భవానీమాత విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు, వెండి కాలిమెట్టలు, కిరీటాన్ని ఎత్తుకెళ్లినట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి జాతీయ రహదారిపై పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
హిందూ సంఘాల ధర్నా
భవానీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. గురువారం రాత్రి మండలంలోని రంజోల్ గ్రామంలో ర్యాలీ అనంతరం 65వ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివలింగం ఆందోళన కారులతో మాట్లాడి 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించినట్లు హిందూ సంఘాల నాయకులు పేర్కొన్నారు.
పట్టపగలే ఇంటో..
అక్కన్నపేట(హుస్నాబాద్): పట్టపగలే ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాయికుంట రాజమొగలి ఇంట్లో గురువార మధ్యా హ్నం గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగులగొట్టి తులం బంగారం అపహరించారు. ఇంటి తలుపులు దగ్గర వేసి బయటకు వెళ్లిన భార్య తిరిగి ఇంటికొచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment