
కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఉరేసుకొని బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని మునిగడపలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మీ దంపతులకు కుమారుడు, కూతురు ప్రవళిక(13) ఉన్నారు. గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న ప్రవళిక రెండ్రోజుల కిందట బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లి గురువారం ఇంటికొచ్చింది. తల్లి బట్టలు ఉతుకుతుండగా కడుపులో నొప్పి వస్తుందని చెప్పి ఇంట్లోకి వెళ్లింది. బయట నుంచి తల్లి నాగలక్ష్మీ పిలిచినా రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. కూతురు మృతితో నాగలక్ష్మీ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పురుగు మందు తాగి వివాహిత
కోహెడరూరల్(హుస్నాబాద్): పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని తీగలగుట్టపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అభిలాష్ కథనం మేరకు.. వేల్పుల విమల (40) కొద్ది రోజులుగా గర్భాశయ సమస్యతో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తరుచూ కడుపునొప్పి వస్తుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతుంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి భర్త కొమురయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment