
సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం
పటాన్‌చెరుటౌన్/పటాన్‌చెరు: తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని శుక్రవారం కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ...తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఏళ్లుగా తనకు అలవాటని అందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.
నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు
కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ జన్మదినం సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
పుట్టినరోజును పురస్కరించుకుని
ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment