
మోసపోతే.. న్యాయం ఇలా..
నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం
సంగారెడ్డి జోన్: మోసపోయిన వారి నుంచి జరిగే అన్యాయాలపై వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక పోరాటం చేస్తోంది. మోసపోయిన వినియోగదారులకు తమ హక్కులను కల్పిస్తూ న్యాయం అందజేస్తోంది. వివిధ రకాల వస్తువుల కొనుగోలులో మోసపోయిన సమయంలో ఫిర్యాదు చేసేందుకు 1915 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. రూ.50లక్షల లోపు ఉంటే జిల్లా కమిషన్, రూ.2 కోట్ల లోపు ఉంటే రాష్ట్రస్థాయిలో, ఆపైన ఉంటే జాతీయస్థాయిలో ఫిర్యాదు చేసుకోవచ్చు. రూ.ఐదు లక్షల లోపు ఉంటే తెల్ల కాగితంపై కొనుగోలు చేసిన వస్తువు వివరాలతో పాటు మోసపోయిన వివరాలు రాసి, సంబంధిత రశీదును జతపరచి ఫిర్యాదు చేయవచ్చు. రూ.10లక్షల లోపు ఉంటే రూ.200, రూ. 20లక్షల లోపు ఉంటే రూ.400, రూ.50లక్షల లోపు ఉంటే రూ.1000, రూ. ఒక కోటి లోపు ఉంటే రూ. 2000, రూ. 2కోట్ల లోపు ఉంటే రూ. 2500, రూ.4కోట్ల లోపు ఉంటే రూ.3వేలు, రూ.6కోట్ల లోపు ఉంటే రూ.4వేలు, రూ.8కోట్ల లోపు ఉంటే రూ.5వేలు, రూ.10కోట్ల లోపు ఉంటే రూ.6వేలు, రూ.10కోట్ల పైన ఉంటే రూ.7,500 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా వినియోగదారులకు మరింతగా సేవలు అందించేందుకు ఆన్‌లైన్ విధానంలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం e-jagriti.gov.in పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
రశీదు తప్పనిసరి
వినియోగదారులు ఏ వస్తువు కొనుగోలు చేసిన ఆ వస్తువుకు సంబంధించి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. నాణ్యత వస్తువులను గుర్తించేందుకు ఎకై ్స్పరీ డేట్ తో పాటు ఇతర వివరాలను పరిశీలించాలి. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో నమోదైన వివిధ రకాల కేసులు 3నెలల నుంచి ఐదు నెలల లోపు సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు కమిషన్ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment