
మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్కరూ మంచి నీరు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు ధరిచేరవని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి తెలిపారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి డయాలసిస్ సెంటర్‌లో జనరల్ మెడిసిన్ విభాగ హెచ్‌ఓడీ డాక్టర్ మదన్‌తో కలిసి డాక్టర్ శాంతి గురువారం కేక్ కట్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. 15 పడకలతో డయాలసిస్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవాలన్నారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. అనారోగ్య సమ స్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్య క్రమంలో జనరల్ మెడిసిన్ విభాగ హెచ్‌ఓడీ డాక్టర్ మదన్, ఆర్‌ఎంఓలు జ్యోతి, సదానందం, శ్రావణి, డయాలసిస్ సెంటర్ ఇన్‌చార్జి రాజు, సిబ్బంది నరేశ్, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి
జీజీహెచ్‌లో వరల్డ్ కిడ్నీ డే వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment