ప్రారంభమైన ‘వాటర్ బెల్’
‘సాక్షి’ కథనంతో పలు బడుల్లో అమలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఎండలు మొదలయ్యాయి. వాతావారణం వేడెక్కుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ‘నీటి గంట మొగిద్దాం’అనే కథనాన్ని ‘సాక్షి’శనివారం ప్రచురించింది. దీనికి స్పందించిన పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటర్ బెల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు వాటర్ బెల్ మోగగానే నీళ్లు తాగారు. ఈ సందర్భంగా వాటర్ బెల్ కార్యక్రమాన్ని అమ లు చేస్తున్న నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణను ‘సాక్షి’ పలకరించగా.. సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల పిల్లలు అనేక రుగ్మతలకు దూరం అవుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment