
మాటలే తప్ప చేతలు శూన్యం
● సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజం ● ఇఫ్తార్ విందుకు హాజరు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు శూన్యమని మండిపడ్డారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్‌రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తెల్లాపూర్ ప్రజల అవసరాల కోసం రూ.500 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో కోట్లాది రూపాయలతో ఫంక్షన్ హాల్‌ను నిర్మించామని అయితే ఇప్పటికీ అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ కోసం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను వెనక్కి తీసుకుందని విమర్శించారు. అంతకుముందు తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని నిర్మించిన ఫంక్షన్ హాల్, అసంపూర్తిగా ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, రసమయి బాలకిషన్, గువ్వల బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment