
బీపీ మాత్రల్లేవు.. బయట తెచ్చుకోండి
● ప్రభుత్వాస్పత్రిలో రోగులకుసూచిస్తున్న ఫార్మాసిస్ట్ ● అతడి నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్
పటాన్‌చెరుటౌన్: ప్రభుత్వాస్పత్రిలో టెల్ మా–40 బీపీ మాత్రల్లేవని, బయట నుంచి తెచ్చుకోవాలని గత మూడురోజులుగా వస్తున్న రోగులకు ఆస్పత్రి ఫార్మాసిస్ట్ వెంకటరెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని శనివారం చాలామంది రోగులు ‘సాక్షి’దృష్టి తీసుకురాగా వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరింది. ప్రస్తుతం టెల్ మా–40 బీపీ మాత్రల కొరత ఉందని, బీపీకి సంబంధించిన ఇతర కాంబినేషన్ ట్యాబ్‌లెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోగులకు బీపీ మాత్రలు లేవని బయట తెచ్చుకోవాలని పంపుతున్న ఫార్మాసిస్ట్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ మాత్రల విషయంపై రోగులతో మాట్లాడగా...టెల్ మా–40 మాత్రలు ముందునుంచి వాడుతున్నామని, ఇతర కాంబినేషన్ (టెల్ మా–40తోపాటు అమోలడిఫిన్) మాత్రలు వేసుకుంటే ఇబ్బంది అవుతోందని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బీపీ మాత్రలు అందుబాటులోకి తీసుకురావాలని ఆస్పత్రికి వచ్చే రోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment