
బాగా చదవాలి.. ఉన్నతస్థాయికి ఎదగాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
సిద్దిపేటరూరల్: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యార్థులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని రాఘవాపూర్ కస్తూర్బా గురకుల పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. పాఠశాల అవరణ అంతటా తిరుగుతూ వంటగది, స్టోర్‌రూం, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, టెన్త్ ఉత్తీర్ణత పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్‌పీసీఈఓ రమేశ్, ఎంపీడీఓ మురళీధర్‌శర్మ, మెడికల్ ఆఫీసర్ బాబు, ఎంఈఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
18న జిల్లా బ్రాహ్మణ
సంఘం ఎన్నికలు
తూప్రాన్: జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు ఈనెల 18న పట్టణంలోని దేవి గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి సోమయాజుల రవీంద్రశర్మ, సహాయ ఎన్నికల అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025– 28 కాలపరిమితికి గాను ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. సంఘంలో సభ్యత్వం ఉన్నవారు ఎవరైన పోటీ చేయవచ్చు అని సూచించారు.
కూడవెల్లి వాగులోకి
నీరు విడుదల
గజ్వేల్‌రూరల్: మల్లన్నసాగర్ కాలువ నుంచి కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. మండల పరిధిలోని కొడకండ్ల వద్ద గురువారం కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్ కాలువ నుంచి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను వదిలారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, నాయకులు గుంటుకు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment