టీ తాగడానికి వెళ్తుండగా బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

టీ తాగడానికి వెళ్తుండగా బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

Published Sat, Mar 15 2025 7:40 AM | Last Updated on Sat, Mar 15 2025 7:41 AM

టీ తా

టీ తాగడానికి వెళ్తుండగా బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

కొండపాక(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిమ్మారెడ్డిపల్లి మధిర సార్లవాడకు చెందిన ఎంకు చంద్రయ్య(60) వ్యవసాయం చేస్తుంటాడు. శుక్రవారం సార్లవాడ నుంచి సమీపంలోని కొమురవెల్లి కమాన్‌ వద్ద ఉన్న హోటల్‌కి టీ తాగడానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు చంద్రయ్యను ఢీకొట్టి వెళ్లాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ పేర్కొన్నాడు.

బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి

చేగుంట(తూప్రాన్‌): ప్రమాదవశాత్తు బ్రిడ్జి పై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిది వడియారం గ్రామ శివారులోని రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. చేగుంటకు చెందిన పులబోయిన శేఖర్‌(26) గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. శుక్రవారం వడియారం రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద శేఖర్‌ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ పంచనామా నిర్వహించారు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి..

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని హద్నూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్‌ కథనం మేరకు.. న్యాల్‌కల్‌కు చెందిన వడ్డె వెంకట్‌(32) ఈనెల 12న ఉదయం ఇంట్లో చెప్పి చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో 13న తల్లి పూలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఉదయం హద్నూర్‌ గ్రామ శివారులోని చెరువులో మృతదేహం తేలినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందినట్లు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బైక్‌ చెట్టును ఢీకొని యువకుడు

తొగుట(దుబ్బాక): బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వెంకట్రావుపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బెజ్జరమైన ప్రశాంత్‌ (28) ఉదయం మిరుదొడ్డికి వెళ్లాడు. సాయంత్రం తిరిగొస్తుండగా గ్రామ శివారులో బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స కోసం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య వర్షిణి, కూతురు శన్విక, కుమారుడు శశాంక్‌ ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి గజ్వేల్‌ ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
టీ తాగడానికి వెళ్తుండగా బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి 1
1/2

టీ తాగడానికి వెళ్తుండగా బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

టీ తాగడానికి వెళ్తుండగా బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి 2
2/2

టీ తాగడానికి వెళ్తుండగా బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement