
పాడి పరిశ్రమకు రుణాలు
ఎన్‌ఎల్‌ఎం అందించే పథకం.. రాయితీ వివరాలు
మేకలు,
గొర్రెలు+పొట్టెలు యూనిట్ విలువ సబ్సిడీ రైతువాటా బ్యాంకు రుణం
500+25 రూ.కోటి రూ.50లక్షలు రూ.10లక్షలు రూ.40లక్షలు
400+20 రూ.80లక్షలు రూ.40లక్షలు రూ.8లక్షలు రూ.32లక్షలు
300+15 రూ.60లక్షలు రూ.30లక్షలు రూ.6లక్షలు రూ.24లక్షలు
200+15 రూ.40లక్షలు రూ.20లక్షలు రూ.4లక్షలు రూ.16లక్షలు
100+5 రూ.20లక్షలు రూ.10లక్షల రూ.2లక్షలు రూ.8లక్షలు
పందులు
మగ+ఆడ యూనిట్ విలువ సబ్సిడీ రైతువాటా బ్యాంకు రుణం
100+10 రూ.30లక్షలు రూ.15లక్షలు రూ.3లక్షలు రూ.12లక్షలు
50+5 రూ.15లక్షలు రూ.7.5లక్షలు రూ.1.5లక్షలు రూ.6లక్షలు
నాటుకోడి పుంజు యూనిట్ విలువ సబ్సిడీ రైతువాటా బ్యాంకు రుణం
1000+100 రూ.50లక్షలు రూ.25లక్షలు రూ.5లక్షలు రూ.20లక్షలు
దాణా, గడ్డి రూ.కోటి రూ.50లక్షలు రూ.10లక్షలు రూ.40లక్షలు
సంగారెడ్డి జోన్: రోజురోజుకీ పెరుగుతున్న మాంసం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గణనీయంగా పెరుగుతున్న మాంసం వినియోగానికి సరిపడా మాంసం ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పశువులతోపాటు మేత, దాణా లభ్యతను పెంపొందించేందుకు సైతం జాతీయ పశు సంపద మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా రుణ అవకాశం కల్పిస్తోంది.
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలు
పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలను మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా గొర్రెలు, మేకలు, పొట్టేలు, పందులు, నాటుకోళ్లు, పుంజులతోపాటు పశుగ్రాసం, దాణా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం పశుసంవర్థక శాఖ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పశువుల పెంపకానికి ఆసక్తి ఉన్న వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తుంది.
రూ.10లక్షల నుంచిరూ.50 లక్షల వరకు సబ్సిడీ
ఎన్.ఎల్.ఎం పథకం ద్వారా రూ.10లక్షల రూ.50 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తుంది. లబ్ధిదారుడికి విడతల వారీగా సబ్సిడీ అందించనున్నారు. యూనిట్ నెలకొల్పిన తర్వాత సబ్సిడీ వచ్చేంత వరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ పర్యవేక్షిస్తుంది.
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు
యూనిట్ స్థాపించేందుకు ఆసక్తి గలవారు www.nlm.udyamimitra.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తుదారుడి ఫొటో, అడ్రస్, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్ తదితర పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అవగాహన లేక పథకానికి దూరం
పశువుల పెంపకానికి ప్రోత్సాహకంగా ఎన్‌ఎల్‌ఎం పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి సబ్సిడీని అందిస్తుంది. పథకం ప్రారంభించి రెండు, మూడేళ్లు గడుస్తున్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో పథకానికి దూరంగా ఉన్నారు.
మాంసం ఉత్పత్తి పెంచే దిశగా...
రూ.50 లక్షల వరకు రాయితీ రుణం
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల ఆహ్వానం
అవగాహన లేక పథకానికి దూరం
సద్వినియోగం చేసుకోవాలి
పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. ప్రతీ యూనిట్‌పై 50% సబ్సిడీ అందిస్తారు. ఆన్‌లైన్ విధానంలో ఆసక్తి కలిగి ఉండి, అనుభవం కలిగి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగి ఉన్న ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.
– వసంతకుమారి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి, సంగారెడ్డి

పాడి పరిశ్రమకు రుణాలు

పాడి పరిశ్రమకు రుణాలు

పాడి పరిశ్రమకు రుణాలు