ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని 33/11కేవీ రంగదాంపల్లి సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్సాన్‌పల్లి, మిట్టపల్లి, ఎల్లుపల్లి, బొగ్గులోనిబండ, మైత్రివనం, కాకతీయనగర్, రాజేంద్రనగర్, బీజేఆర్ చౌరస్తా, మహాశక్తినగర్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.
ఘనంగా చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డే
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు ఉపేంద్ర, అండాలు మాట్లాడుతూ 4వ శనివారం సందర్భంగా పిల్లల తల్లులకు సృజనాత్మకతపై అవగాహన కల్పించామన్నారు. అనంతరం చిన్నపిల్లలు ఆడుకునే వివిధ రకాల బొమ్మలు తయారుచేసే విధానంపై తల్లులకు శిక్షణ ఇచ్చారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను పలు రకాల ఆకులు, పువ్వు లు, పెన్సిల్ పొట్టు, స్కెచ్‌లు, మట్టితో తయా రు చేసిన బొమ్మలను ప్రదర్శించారు. కార్యక్రమంలో తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
నంగునూరు(సిద్దిపేట): బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న బైరి శంకర్‌ను శనివారం ఆ పార్టీ మండల నాయకులు అభినందించారు. మాజీ మండలాధ్యక్షుడు బెదురు కుమారస్వామి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, శ్రీనివాస్, సత్యం, స్వామి, కిష్టయ్యగౌడ్, ప్రసాద్, రమేశ్, అనిల్ పాల్గొన్నారు.
నేడు ‘నీరాజనం’ పుస్తకావిష్కరణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రముఖ పద్యకవి షరీఫ్ రచించిన నీరాజనం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. సిద్దిపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్బన్ మండల పరిధిలోని తడకపల్లి ఆవాస విద్యాలయంలో మధ్యాహ్నం జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పద్య సాహిత్య శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన కవులు, రచయితలు, సాహితీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యి విజయవంతం చేయాలని కోరారు. జాతీయ సాహిత్య పరిషత్ సభ్యుడు అశోక్, ఎల్లమ్మ పాల్గొన్నారు.
ఇసుక డంపుల స్వాధీనం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని జాలపల్లిలో అక్రమంగా డంపు చేసిన ఇసుకను శనివారం టాస్క్‌ఫోర్స్, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ షేక్ మహబూబ్ మాట్లాడుతూ గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద తుపాకుల శ్రీనివాస్, పోతన యాదగిరి ఎలాంటి అనుమతి లేకుండా 20 టన్నుల ఇసుకను డంపు చేశారన్నారు. విశ్వనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఆ డంపును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Comments
Please login to add a commentAdd a comment