చక్రం తిప్పిన కింగ్
కింగ్ బుక్‌స్టాల్‌కు చెందిన యజమానిని ఏజెంట్‌గా సదరు మాజీ అధికారి నియమించుకున్నారు. ఆ బుక్ స్టాల్‌కు చెందిన కుటుంబ సభ్యుల ద్వారా వివిధ ఎంటర్‌ప్రైజెస్‌ల పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. మే, 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు థర్డ్ పార్టీ పేరుతో రూ.1.2కోట్లన సబ్సిడీని విడుదల చేశారు. ఎంటర్‌ప్రైజెస్ పేరు మీద ఆరుగురి సబ్సిడీలను రూ.26.80లక్షలు, కింగ్ బుక్ స్టాల్ పేరు మీద ముగ్గురికి రూ.14.40లక్షలు, కింగ్ భవాని ఎంటర్‌ప్రైజెస్ పేరు మీద మరో ముగ్గురికి రూ.10.80లక్షలు, అలాగే కింగ్‌కు సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల మీద, వాహనాలు కొనుగోలు చేసేందుకు నేరుగా లబ్ధిదారులకే చెక్‌లను విడుదల చేశారు. ఇలా మొత్తంగా థర్డ్ పార్టీ పేరుతో 34 మందికి సంబంధించి సబ్సిడీ రూ.1.20కోట్లను విడుదల చేశారు. ఒక్కో లబ్ధిదారుని దగ్గర రూ.80వేల నుంచి రూ.2లక్షల వరకు డబ్బులను కింగ్, మాజీ అధికారి తీసుకుని అందజేసినట్లు తెలుస్తోంది. పాడి పశువుల పంపిణీలో ఆక్రమాలను గతంలో ‘సాక్షి’ వెలికితీయగా, అలాగే ఇతర అక్రమాలు పాల్పడినట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో విచారణ చేసి ఎస్సీ కార్పొరేషన్‌కు సరెండర్ చేశారు. గతంలో పనిచేసిన అధికారి పాల్పడిన ఆక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యూనిట్లను ఏర్పాటు చేయకుండానే సబ్సిడీలను విడుదల చేసిన అధికారి, సహకరించిన ఏజెంట్ కింగ్‌కు సంబంధించిన ఎంటర్‌ప్రైజెస్‌లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment