
చికెన్‌పై అపోహలు వద్దు
గజ్వేల్: తెలంగాణలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకలేదని, నిరభ్యరంతరంగా చికెన్, కోడిగుడ్లను వినియోగించవచ్చని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్‌లో వెన్‌కాబ్ ఆధ్వర్యంలో శనివారం చికెన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్, ఉడికిన కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సారెడ్డి మాట్లాడుతూ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చికెన్ ఉడికితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. చక్కని పోషక విలువలు కలిగిన చికెన్‌కు ప్రజలు దూరంగా ఉండొద్దని, అపోహలను పట్టించుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సర్దార్‌ఖాన్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment