
ఫర్నీచర్ అందజేసిన పూర్వవిద్యార్థిని
గజ్వేల్‌రూరల్: తాను చదువుకున్న పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్‌ను అందించిన పూర్వ విద్యార్థిని అందరి మన్ననలు పొందింది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ(పల్లెపహాడ్)కు చెందిన అనంతోజు లాస్య (భార్గవి) 6వ తరగతి వరకు గ్రామంలోని ఎంపీపీఎస్‌లో చదువుకుంది. ప్రస్తుతం ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. తాను చదువుకున్న పాఠశాలకు సాయం చేయాలని నిర్ణయించుకొని, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలకు ఒక బీరువా, 7 కుర్చీలు, 7 టేబుళ్లు శనివారం అందజేసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు భార్గవి దంపతులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు మంజుల, రేణుక, ప్రభావతి, గీతామాధురి, శ్వేత, శ్రీకరి, సీఆర్పీ చంద్రశేఖర్, అశోక్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment