
ఎన్నిక ఏదైనా నామినేషన్ వేయాల్సిందే
యువతకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యమంటున్న ఇంద్రాగౌడ్
గజ్వేల్: రాజకీయాలు మాకేందుకు? అనుకునే యువత ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన యువకుడు సిలివేరి ఇంద్రాగౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చట్టసభలకు జరిగే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. 36 ఏళ్ల వయసున్న ఇతను 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి మాజీ సీఎం కేసీఆర్‌పై పోటీ చేశారు. ఈ సందర్భంగా కేవలం 400ఓట్లు మాత్రమే పొందారు. నేషనల్ నవ క్రాంతి అభ్యర్థిగా పోటీ చేశారు. అదేవిధంగా 2024 ఏప్రీల్‌లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి అదే పార్టీ బీఫారంపై పోటీచేశారు. ఈ సందర్భంలోనూ 1,920 ఓట్లకే పరిమితమయ్యారు. అయినా నిరాశ చెందకుండా, తాజాగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నేషనల్ నవ క్రాంతి అభ్యర్థిగానే పోటీచేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని చెబుతున్న ఇంద్రాగౌడ్...యువత రాజకీయాలపై మక్కువ పెంచుకొని ముందుకువచ్చేలా చేయడమే తన లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment