గజ్వేల్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు
వర్గల్(గజ్వేల్): గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. వర్గల్ మండలం తున్కిఖాల్సాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నా మన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వివిధశాఖలకు చెందిన పనుల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్లు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ నియోజకవర్గాన్ని, ప్రజలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు. తన హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు ఆయన ఫాంహౌజ్ వీడాలని, ప్రజల బాగోగుల కోసం బయటకు రావాలని సలహా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు సందీప్‌రెడ్డి, విద్యాకుమార్, శ్రీరాం నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
తున్కిఖల్సాలో సీసీ రోడ్డు పనులు షురూ..
Comments
Please login to add a commentAdd a comment