364 ప్రత్యేక బస్సులు
● శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ఏర్పాట్లు ● సద్వినియోగం చేసుకోవాలి: ఆర్‌ఎం
సంగారెడ్డి జోన్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 364 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈనెల 26 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు నడపనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆరు డిపోల నుంచి ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రం, ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయం, వట్‌పల్లి, కొప్పోల్ జాతరలు, టేకులగడ్డ ఆలయ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రభులత తెలిపారు. ఏడుపాయల దుర్గ భవానీ క్షేత్రానికి మెదక్ నుంచి 40, జేబీఎస్, బాలానగర్ నుంచి 30, నర్సాపూర్ నుంచి 30, శంకరంపేట నుంచి 25, బొడ్మట్ పల్లి నుంచి 30, హైదరాబాద్ నుంచి 20, సంగారెడ్డి నుంచి 30, సదాశివపేట నుంచి 25, జోగిపేట నుంచి 20, జహీరాబాద్ నుంచి 30, ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయానికి జహీరాబాద్ నుంచి 32, వట్‌పల్లిలో జరిగే జాతరకు జోగిపేట నుంచి 20, శంకర్ పల్లి నుంచి ఏడుపాయల జాతరకు 10, శంకరంపేట నుంచి కొప్పోల్ జాతరకు 13, టేకుల గడ్డ నుంచి ఆలయం వరకు 9, మొత్తం 364 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం వివరించారు. వీటితో పాటు జహీరాబాద్ నుంచి ఝరాసంగానికి 6, శంకరంపేట నుంచి కొప్పోల్‌కు 4, జోగిపేట నుంచి వట్‌పల్లికి 5, సిద్దిపేట నుంచి వేములవాడకు సాధారణ బస్సులతో పాటు అదనంగా మూడు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఆయా క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రత్యేక బస్సులలో 26నుంచి 28వరకు చార్జీ అదనంగా ఉన్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి జాతర కోసం ఉమ్మడి జిల్లాలోని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment