పనుల్లో నాణ్యత తప్పనిసరి
కోహెడరూరల్(హుస్నాబాద్): ఇన్నోవేషన్ పార్క్ పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ మునూచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని సముద్రాల గ్రామంలో నిర్మిస్తున్న ఇన్నోవేషన్ పార్క్ పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనుచౌదరి
ఇన్నోవేషన్ పార్క్ సందర్శన
Comments
Please login to add a commentAdd a comment